- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హౌజింగ్ బోర్డుకు కాసుల వర్షం.. KPHBలో ఎకరానికి రూ.65.34 కోట్లు
కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని ఓపెన్ ఫ్లాట్లకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని ఓపెన్ ఫ్లాట్లకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ-ఆక్షన్ ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్‌లో బుధవారం హౌజింగ్ బోర్డు భూములను విక్రయించింది. కేపీహెచ్‌బీ 4 ఫేజ్‌లోని ఫ్లాట్ నెం 1కు చెందిన ఎకరం విస్తీర్ణంలోని కమర్షియల్ ఓపెన్ ల్యాండ్‌ను రూ.65.34 కోట్లకు కొనుగోల చేశారు. ఆన్‌లైన్ ద్వారా వేలం పాట నిర్వహించినందున బిడ్డర్ల వివరాలు చివరి నిమిషం వరకు ఎవరికీ తెలియలేదు. దాంతో బిడ్డర్లు స్వేచ్ఛగా ధరను కోట్ చేయడంతో రికార్డు స్థాయిలో పలికింది. ఈ స్థలానికి సంబంధించిన వేలం పాటకు మొత్తం 11 బిడ్లు దాఖలు కాగా, నలుగురు బిడ్డర్లు వేలం పాటలో పాల్గొన్నట్లు హౌజింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా సంస్థ ఎకరా భూమిని రూ.65.34 కోట్లకు వేలం పాటలో కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. బండ్లగూడ నాగోల్‌లోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.26 కోట్ల మేర ఆదాయం సమకూరింది.






