- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
House Arrest: ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత.. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి హౌజ్ అరెస్ట్
హెచ్సీయూ(HCU) భూములపై క్యాంపస్ (Campus)లో విద్యార్థుల ఆందోళన నిర్విరామంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: హెచ్సీయూ(HCU) భూములపై క్యాంపస్ (Campus)లో విద్యార్థుల ఆందోళన నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ మొత్తం తరగతుల బహిష్కరణకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేలా నిరసనలను మరింత ఉధృతం చేయాలని వారు నిర్ణియించారు. ఈ నేపథ్యంలోనే హెచ్సీయూ (HCU)లో 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములను పరిశీలించి అక్కడున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు బీజేపీ (BJP) నేతలు హెచ్‌సీయూకి బయలుదేరేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే ముందస్తుగా పోలీసులు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో హౌజ్ అరెస్ట్ చేశారు. ఇక ఎమ్మెల్యే క్వార్టర్స్ (MLA Quarter)ను పోలీసులు చుట్టుముట్టి.. అక్కడి వచ్చిన ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పాయల్ శంకర్, నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక హెచ్‌సీయూ మెయిన్ గేట్ ఎదుట ఇవాళ సీపీఎం (CPM) నాయకులు ధర్నాకు పిలునిచ్చారు.






