- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hot News: కాంగ్రెస్ వార్ రూంలో బీఆర్ఎస్ కోవర్టు..! అధిష్టానం ఫుల్ ఫోకస్
కాంగ్రెస్ వార్ రూంలో పనిచేస్తున్న ఓ కీలక వ్యక్తిని బీఆర్ఎస్ కోవర్టుగా అనుమానిస్తున్న అధిష్టానం అతన్ని తప్పించి, కొత్త వారికి ఆ బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ వార్ రూంలో పనిచేస్తున్న ఓ కీలక వ్యక్తిని బీఆర్ఎస్ కోవర్టుగా అనుమానిస్తున్న అధిష్టానం అతన్ని తప్పించి, కొత్తవారికి ఆ బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎందుకంటే వార్ రూంలో చర్చించే పార్టీ వ్యూహాలు, ప్లానింగ్స్‌ను ఎప్పటికప్పుడు గులాబీ లీడర్లకు చెరవేసేలా అతనితో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. కొన్ని నెలలుగా సదరు వ్యక్తి కదలికలు, పనితీరుపై నజర్ పెట్టిన పార్టీ అతన్ని మొత్తానికి తప్పించినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే కొత్తవారికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో అందుకే వీక్?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ వార్ రూమ్ బాధ్యతలను సునీల్ కనుగోలు టీమ్‌కు కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార తీరుతెన్నులు, ఎన్నికల స్ట్రాటజీల్లో ఆ టీమ్ కీలకంగా పనిచేసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వార్ రూమ్‌లో పనిచేసే వ్యక్తుల సంఖ్యను కుదించి, కొందరికే పరిమితం చేశారు. ఆ టీమ్‌కు ప్రభుత్వ పథకాల ఫీడ్ బ్యాక్, సోషల్ మీడియా వేదికగా విపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇచ్చే బాధ్యతలు అప్పగించారు. కానీ, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై సోషల్ మీడియా వేదికగా తక్కువ ప్రచారం జరుగుతోందని, విపక్షాల విమర్శలకు దీటైన కౌంటర్లు ఇవ్వడం లేదని స్వయంగా కాంగ్రెస్ లీడర్లే పెదవి విరిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ వ్యవహారం మొత్తం ఓ ప్లాన్ ప్రకారమే జరిగిందని, వార్ రూంలోని ఓ కీలక వ్యక్తి గైడెన్స్ మేరకు పార్టీ గ్రాఫ్‌ను తగ్గించే విధంగా వ్యవహరించారనే విషయం బయటకు వచ్చినట్లు తెలిసింది.
పెద్ద మొత్తంలో ప్యాకేజీ?
ఎన్నికలకు ముందు చాలా స్ట్రాంగ్‌గా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఇప్పుడు ఎందుకు డీలా పడిపోయిందని పార్టీలోని కీలక నేతలు ఆరా తీశారు. కొన్ని నెలలుగా వార్ రూమ్ లో పనిచేస్తోన్న వ్యక్తుల కదలికలపైనా నిఘా పెట్టారు. దీంతో బీఆర్ఎస్ కోవర్టును గుర్తించినట్టు తెలిసింది. వార్‌రూంలో కీలక హోదాలో పనిచేస్తున్న ఓ వ్యక్తి బీఆర్ఎస్ లీడర్లతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ కాంగ్రెస్ వ్యూహాలను అటు చేరవేస్తున్నట్లు, అందుకు ప్రతిఫలంగా ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం పొందినట్టు ఆధారాలతో సహా పట్టుకున్నట్టు తెలిసింది. దీంతో వెంటనే అతన్ని అక్కడ నుంచి తప్పించి, కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని సమాచారం. ఉన్నట్టుండి సదరు వ్యక్తిని ఇంటికి పంపించడంపై వార్ రూంలో ఏం జరుగుతోందనే ఆందోళన అక్కడ పనిచేస్తున్న బృందంలో మొదలైందని టాక్ వినిపిస్తోంది.






