తెలంగాణ తల్లి విగ్రహంపై హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

తెలంగాణ తల్లి విగ్రహంపై హాట్ కామెంట్స్

తెలంగాణ తల్లి విగ్రహంపై హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహ రూపురేఖలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. ‘‘తెలంగాణ తల్లి.. ఉద్యమ భావోద్వేగాల మధ్య, పోరాట స్ఫూర్తితో పుట్టిన రూపం. తెలంగాణ బిడ్డలంతా స్వచ్ఛందంగా ఊరూరా, వాడవాడలా విగ్రహాలు పెట్టుకొని పూజించుకున్నాం. ఇప్పుడు మార్పు.. మార్పు అంటూ తల్లి చేతిలో నుండి మన సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మను తీసేసి, ఉద్యమానికి ఏమాత్రం సంబంధంలేని కాంగ్రెస్ తల్లిని సృష్టించి ఆ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. తల్లి రూపాన్నే మార్చిన చరిత్రహీనులుగా కాంగ్రెస్ నేతలు మిగిలిపోవడం ఖాయం. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఈ కాంగ్రెస్ తల్లి విగ్రహాలను గాంధీ భవన్‌కు తరలించుడం పక్కా’’ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

Next Story