ప్రార్థనతోనే చికిత్స.. ఇక డాక్టర్లెందుకూ.? సర్కారు ఆసుపత్రిలో దైవ చిట్కాలు..

by Bhanu |

నల్లగొండ ప్రభుత్వ మాత శిశు సంరక్షణ కేంద్రం ఇప్పుడు వైద్యం కన్నా ‘బోధన’తో ప్రసిద్ధి చెందుతోంది..!

ప్రార్థనతోనే చికిత్స.. ఇక డాక్టర్లెందుకూ.? సర్కారు ఆసుపత్రిలో దైవ చిట్కాలు..
X

దిశ, నల్లగొండ: నల్లగొండ ప్రభుత్వ మాత శిశు సంరక్షణ కేంద్రం ఇప్పుడు వైద్యం కన్నా ‘బోధన’తో ప్రసిద్ధి చెందుతోంది..! మందులకన్నా ప్రార్థనలే మక్కువగా మారిన ఈ ఆసుపత్రిలో ఓ విచిత్రమైన పరిణామం వెలుగులోకి వచ్చింది. చికిత్సకు వచ్చిన పేషంట్ల దగ్గరకు హఠాత్తుగా వచ్చి “ఆరోగ్యం మెరుగవుతుంది” అంటూ చేతులు పెట్టి, ఆశీర్వాదాలు ఇవ్వడమే కాకుండా.. మతపరమైన మాయాజాలంతో రోగాన్ని తరిమికొడతామని బోధించడమే పనిగా పెట్టుకున్నారు కొందరు పాస్టర్లు..

“ఏం చేస్తున్నారు?” అని అడిగితే, పేషంట్లు సింపుల్‌గా “మా ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు” అంటూ స్వచ్ఛంగా సమాధానం ఇచ్చేశారు. అయితే మతప్రచారంతో పాటు అసలైన వైద్యం మాయమవుతోందనే ఆరోపణలు ఇప్పుడు వెల్లివిరుస్తున్నాయి.

ఆసుపత్రిలో కనిపించిన ఓ గుంపు పాస్టర్ల బృందం రోగుల చేతులు పట్టుకుని ప్రార్థనలతో వాటిని ‘బాక్టీరియా ఫ్రీ’ చేస్తోంది. పక్కనే ఉన్న సిబ్బంది మాత్రం వారిని సైలెంట్‌గా బయటికి పంపారని తెలుస్తోంది. మరి హాస్పిటల్ సూపరిండెంట్ ఏం చెబుతారోనని ఫోన్ చేస్తే, ఆమె ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయలేదు!

ఇకపోతే ఇదంతా చూస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రులకే ఒక కొత్త బ్రాంచ్.. "దివ్య వైద్య శాఖ (Dept. of Divine Healing)" అన్న కొత్త విభాగం ఏర్పాటు చేసినట్టుంది..! వాస్తవానికి ఇది మత ప్రచారమా? లేక మన ప్రజల్లోని నమ్మకం బలమా? అనే ప్రశ్నలు ఇప్పుడిప్పుడే ఆసుపత్రి గోడల్ని ఢీకొడుతున్నాయి.

Next Story