అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎంపీ మధుయాష్కీ భార్యకు తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-03 14:25:00  IST  )

నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ భార్య డాక్టర్ సుచీ యాష్కీ అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎంపీ మధుయాష్కీ భార్యకు తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ (Madhu Yaskhi Goud) కుటుంబంలో తీవ్ర ఆందోళన నెలకొంది. అమెరికాలో జరిగిన ఓ ఘోర కారు ప్రమాదంలో ఆయన భార్య డాక్టర్ సుచీ యాష్కీ (Suchi Yashki) తీవ్రంగా గాయపడ్డారు. మధుయాష్కీ గౌడ్ కుటుంబ సభ్యులు తమ కుమార్తె గగన (Gagana)ను మెడిసిన్ ఉన్నత చదువుల నిమిత్తం కాలేజీలో జాయిన్ చేసేందుకు అమెరికా వెళ్లారు. కూతురి అడ్మిషన్ ప్రక్రియ ముగించుకుని వారు బోస్టన్ నగరం నుంచి తిరిగి న్యూయార్క్ ప్రయాణమవుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

మార్గమధ్యంలో భారీ వర్షం కురుస్తుండటంతో రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపైనే పలు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న మధుయాష్కీ భార్య డాక్టర్ సుచీ యాష్కీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత కారణంగా ఆమె పక్కటెముకలు విరిగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Next Story