మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, బైక్ ఢీకొని ఐదుగురు దుర్మరణం

by Malleboina Mahesh |   (  Updated:2026-05-11 03:19:49  IST  )

మహబూబ్ నగర్ జిల్లా పాలకొండ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. స్పోర్ట్స్ బైక్, కారు ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, బైక్ ఢీకొని ఐదుగురు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న కారు బైక్ ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం (Fatal accident) చోటు చేసుకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని పాలకొండ చౌరస్తాలో చోటు చేసుకుంది. కారు యూటర్న్ తీసుకుంటుండగా స్పోర్ట్స్ బైక్ కారు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని.. ఒకే కుటుంబానికి చెందిన అర్షియ బేగం(30), ఉజేప(7), అమర్(2)లు, బైక్‌పై ఉన్న హైదరాబాద్‌కు చెందిన బైకర్ యాకుబ్ అఫ్జల్(25)తో పాటు మరో వ్యక్తిగా అధికారులు గుర్తించారు. ప్రమాద సమయంలో స్పోర్ట్స్ బైక్ 140 కి మీ వేగంతో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story