‘హోం మంత్రి మహమూద్ అలీ రాజీనామా చేయాలి’

by Disha Web Desk 4 |
‘హోం మంత్రి మహమూద్ అలీ రాజీనామా చేయాలి’
X

దిశ, శంకరపట్నం: తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ రాజీనామా చేయాలని శంకరపట్నం మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ ఏనుగుల అనిల్ డిమాండ్ చేశారు. శంకరపట్నం మండల శాఖ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు బిజిలి సారయ్య ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ రహదారిపై భారీ ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ మాట్లాడారు. తెలంగాణలో ప్రజలకు రక్షణ కరువైందని, ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాకతీయ మెడికల్ వైద్యశాల మెడికో విద్యార్థిని ప్రీతి నాయక్ మృతికి కారమైన దోషులను కఠినంగా శిక్షించి, ప్రీతి నాయక్ కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలన్నారు.

ప్రీతి కుటుంబానికి అండగా బీజేపీ పార్టీ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకటరెడ్డి, అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, జిల్లా నాయకులు రాజిరెడ్డి, కొమురయ్య, జైపాల్, ఎస్టి మోర్చా మండల శాఖ అధ్యక్షుడు బిజిలి సారయ్య, మండల నాయకులు సంపత్, నరేందర్, శివారెడ్డి, శ్రీకాంత్ ,వీర అర్జున్‌తో పాటు వివిధ గ్రామాల బూత్ కమిటీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Next Story