- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై అనుమతితోనే సెలవులు.. పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు
ఇక నుంచి అనుమతితో సెలవులు తీసుకోవాలని, డ్యూటీలకు దూరం ఉంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని పంచాయతీ రాజ్‌శాఖ పేర్కొంది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇక నుంచి అనుమతితో సెలవులు తీసుకోవాలని, డ్యూటీలకు దూరం ఉంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని పంచాయతీ రాజ్‌శాఖ పేర్కొంది. ఈమేరకు గురువారం పంచాయతీ రాజ్‌శాఖ సెక్రటరీ తెలంగాణలోని అన్నిముఖ్య కార్యనిర్వహణాధికారులు, జెడ్పీపీ, జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వు నోట్‌ను పంపారు. ఇందులో కొంతమంది ఉద్యోగులు అధికారుల నుంచి అనుమతి పొందకుండా దీర్ఘకాలిక సెలవుపై కొనసాగుతున్నారని పేర్కొన్నారు, ఆరు నెలల వ్యవధి పూర్తయిన తర్వాత వారు తమ ప్రస్తుత పోస్టింగ్ స్థలాన్ని మార్చమని అభ్యర్థనతో సీపీఆర్ఆఫీసులో నివేదిస్తున్నారన్న విషయాన్ని గుర్తించామని తెలిపారు. దీంతోనే సెలవులపై సూచనలు జారీ చేశామని తెలిపారు. ఉద్యోగి అనుమతి లేకుండా సెలవుపై వెళ్లడం, విధులకు దూరంగా ఉన్న అన్ని సందర్భాల్లో, అవసరమైన క్రమశిక్షణ చర్యలు వెంటనే తీసుకోవడం జరుగుతందని ఉత్తర్వులో వివరించారు.






