TG Govt: వారికి గుడ్ న్యూస్.. హోలీ పండుగ సెలవు ప్రకటన

by Gantepaka Srikanth |

మార్చి 12వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెసిలిందే. 12వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సమావేశాలు జరుగనున్నాయి.

TG Govt: వారికి గుడ్ న్యూస్.. హోలీ పండుగ సెలవు ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మార్చి 12వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెసిలిందే. 12వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సమావేశాలు జరుగనున్నాయి. అయితే, బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Assembly Budget Meetings) ప్రారంభం కాగానే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. తర్వాతి రోజు రెండు సభల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశ పెడతారు. ఇదిలా ఉండగా.. 13న గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం అనంతరం 14వ తేదీన హోలీ పండుగ నేపథ్యంలో అసెంబ్లీకి సెలవు(Holi Holiday) ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈనెల 19న తెలంగాణ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు.. ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్(BRS) అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) హాజరుకానున్నారు. బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అసెంబ్లీలో ఏం మాట్లాడుతారో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story