- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లోబల్ లుక్‌లోకి మారనున్న HMDA.. డెలాయిట్ రిపోర్ట్ రెడీ!
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) పునర్వ్యవస్థీకరణకు సంబంధించి డెలాయిట్ నివేదిక సిద్ధమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధి విస్తరించిన రాష్ట్ర ప్రభుత్వం సమూల మార్పులు చేయడానికి కసరత్తు చేస్తోంది. పరిధి పెరగడంతో ప్రజలకు హెచ్ఎండీఏ సేవలందడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సంస్థాగత నిర్మాణంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే అధికారుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే హెచ్ఎండీఏ సంస్థాగత నిర్మాణంపై అధ్యయనం చేయడంతోపాటు రిపోర్ట్ తయారుచేసే బాధ్యతలను డెలాయిట్ కంపెనీకి అప్పగించారు. ఈ ఏజెన్సీతో అధికారుల కమిటీ పలుమార్లు సమావేశమైంది. హెచ్ఎండీఏలో చేయాల్సిన మార్పుల గురించి సమావేశాల్లో చర్చించారు. మొత్తంగా హెచ్ఎండీఏ రీ-ఆర్గనైజేషన్‌కు సంబంధించిన రిపోర్టు రెడీ అయినట్టు తెలిసింది. ఈ రిపోర్టుపై అధికారులతో కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ చర్చించడంతోపాటు పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి పంపించనున్నారు.
నివేదిక సిద్ధం..
హెచ్ఎండీఏలోని అన్ని విభాగాల అధికారులతో డెలాయిట్ ప్రతినిధులు చర్చించారు. ఏఏ విభాగం.. ఏయే పనులు చేపడుతున్నది. ఆ విభాగంలోని ‘అధికారుల స్థాయి.. వాళ్లకు ఉన్న అధికారాలు, చేస్తున్న పనులు.. మార్పులు చేయాల్సిన అంశాలు.’ వంటి వాటిపై రిపోర్టు తయారు చేశారు. హెచ్ఓడీలతోపాటు కింది స్థాయి అధికారులతోనూ చర్చించినట్టు పలువురు అధికారులు తెలిపారు. ఆయా విభాగాలు చేస్తున్న పనులు.. అధికారులకు కావాల్సిన ఆఫీసు ఏర్పాట్లు, మౌలిక వసతుల గురించి చర్చించినట్టు తెలిసింది.
హెచ్ఎండీఏ పరిధి ఇలా..
హెచ్ఎండీఏ పరిధిని 10,472.72చదరపు కిలో మీటర్లకు పెంచింది. హెచ్ఎండీఏలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట్, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి ఉన్నాయి. కొత్తగా నల్లగొండ, వికారాబద్, నాగర్‌కర్నూల్ జిల్లాలను చేర్చింది. అయితే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి ట్రిపుల్ ఆర్ మధ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1355 రెవెన్యూ గ్రామాల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 533 గ్రామాలు, అత్యల్పంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో మూడు గ్రామాలు ఉన్నాయి. రంగారెడ్డి 533, మేడ్చల్-మల్కాజ్ గిరి 163, యాదాద్రి-భువనగిరి 162, సంగారెడ్డి 151, మెదక్ 101, సిద్దిపేట్ 74, హైదరాబాద్ 64, వికారాబాద్ 31, మహాబూబ్ నగర్ 19, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మూడు గ్రామాలు ఉన్నాయి.
జాతీయ, అంతర్జాతీయ నగరాల్లో అధ్యయనం
ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) ఏరియా 1400 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దేశ రాజధాని, జన సాంద్రత ఎక్కువగా ఉన్న ఈ ఏరియాను 14 జోన్లుగా విభజించారు. అంటే సుమారు 100 చదరపు కిలోమీటర్లను ఒక జోన్‌గా నిర్ణయించారు. దీంతోపాటు హర్యాన, ముంబై మెట్రోపాలిటన్ నగరాలతోపాటు హాంగ్‌కాంగ్, సింగపూర్ లాంటి అంతర్జాతీయ నగరాల డెవలప్‌మెంట్ అథారిటీలను సైతం అధ్యయనం చేశారు.
ఢిల్లీ తరహాలో జోనల్ కమిషనర్లు
ఢిల్లీ తరహాలో హెచ్ఎండీఏ పరిధిలో సైతం జోనల్ కమిషనర్ల వ్యవస్థను తీసుకురావాలని హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. డెలాయిట్ సంస్థ జోనల్ కమిషనర్ల సిపార్సు చేసినట్టు తెలిసింది. హెడ్ ఆఫీసు స్థాయిలో పరిపాలన విభాగంలో జేఎంసీలు, ఇంజినీరింగ్ విభాగంలో చీఫ్ ఇంజినీర్, ప్లానింగ్ విభాగంలో డైరెక్టర్లు, అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ ఉంటారు. జోనల్ కమిషనర్లతోపాటు ఇంజినీరింగ్ విభాగంలో ఎస్ఈ, ప్లానింగ్ విభాగంలో సీపీఓ/పీఓ, అర్బన్ ఫారెస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్లు/ఫారెస్ట్ రేంజ్ మేనేజర్లు ఉండే అవకాశాలు ఉన్నాయి.






