ప్రభుత్వ లాంఛనాలతో H.J దొర అంత్యక్రియలు.. అధికారిక ఉత్తర్వులు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-14 02:36:25  IST  )

మాజీ డీజీపీ హెచ్.జె. దొర అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ లాంఛనాలతో H.J దొర అంత్యక్రియలు.. అధికారిక ఉత్తర్వులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), భారత ప్రభుత్వ మాజీ విజిలెన్స్ కమిషనర్ హెచ్.జె. దొర (H.J. Dora) మరణం పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఆయన శుక్రవారం నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసు లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్.జె. దొర కుటుంబ సభ్యులతో సంప్రదించి, అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌‌కు ఆదేశాలు అందాయి. అదేవిధంగా అంత్యక్రియల సమయంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా బందోబస్తు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సీఎస్ ఆదేశించారు.

Next Story