గిరిజన సంక్షేమ రంగంలో చారిత్రాత్మక మార్పులు

by Gantepaka Srikanth |

గిరిజన సంక్షేమ రంగంలో చారిత్రాత్మక మార్పులు

గిరిజన సంక్షేమ రంగంలో చారిత్రాత్మక మార్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: తమ పార్టీ ఎన్నికలతో పాటు దేశ గౌరవం, భారతదేశ స్వాతంత్ర్యం , దేశ సంస్కృతి, ధర్మాన్ని కాపాడేందుకు పోరాడిన మహనీయులను గౌరవించే సంప్రదాయం ఉందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ పేర్కొన్నారు. గురువారం పార్టీ రాష్ర్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవలి కాలంలో సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతిని రన్ ఫర్ యూనిటీ, మార్చ్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా ఘనంగా జరుపుకున్నాం. కొద్ది రోజుల క్రితం వందే మాతరం 150 సంవత్సరాల సందర్భంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. మరో మహానాయకుడు భగవాన్ బిర్సా ముండా జయంతి ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం జనజాతీయ గౌరవ దివస్”గా ప్రకటించిందన్నారు. బిర్సా ముండా బ్రిటిష్‌లతో పాటు మిషనరీల అన్యాయాలకు వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పోరాడారు.

ఆయన భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఆశ, ప్రేరణ, ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మోడీ అధికారం చేపట్టిన తరువాత గిరిజన సంక్షేమ రంగంలో చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆయన నాయకత్వంలో 6,700 గ్రామాల్లో 90,000 ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా తాగునీటి సదుపాయం కల్పించబడిందన్నారు. వెయ్యి కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు, 531 గిరిజన తెగలను వన్ ధన్ వికాస్ కేంద్రాలు కింద సమీకరించి ఆర్థిక స్వావలంబన దిశగా చర్యలు చేపటినట్లు వెల్లడించారు. ఈ ఏడాది గిరిజన సంక్షేమం కోసం రూ. 42 వేల కోట్లు కేటాయించటం మోడీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ పాలనలో గిరిజన సంక్షేమం ఎప్పుడూ ప్రాధాన్యం పొందలేదు. గిరిజన సమాజం కోసం నిజంగా కృషి చేసింది బీజేపీ ప్రభుత్వం మాత్రమే. గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఎస్‌.టీ. కమిషన్ మొదటగా అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలోనే ఏర్పడ్డాయి. పలు నోడల్ ఏజెన్సీల ద్వారా గిరిజన అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించే కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదు. ముఖ్యమంత్రి ఇటీవల కొంత బకాయిలు క్లియర్ చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని మండిపడ్డారు. గురుకుల పాఠశాలలు, బీసీ హాస్టళ్లలో, గిరిజన హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు లేకపోతే మధ్యాహ్న భోజన పథకం స్తంభించే ప్రమాదం ఉందన్నారు. అనేక బీసీ హాస్టళ్లలో ఆహార నాణ్యత తీవ్రంగా తగ్గింది. విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. తాజాగా అచ్చంపేటలో బీసీ హాస్టల్‌లో 50 నుంచి60 మంది విద్యార్థులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వికారాబాద్‌లో కూడా హాస్టల్ భోజనం తిన్న తర్వాత అనేక మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story