సాగునీటి వాటా కోసం ఆయన పోరాటం స్పూర్తిదాయకం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |

సాగునీటి వాటా కోసం ఆయన పోరాటం స్పూర్తిదాయకమని ఆర్ విద్యాసాగర్ రావు (R Vidhyasagar Rao)ను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు.

సాగునీటి వాటా కోసం ఆయన పోరాటం స్పూర్తిదాయకం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సాగునీటి వాటా కోసం ఆయన పోరాటం స్పూర్తిదాయకమని ఆర్ విద్యాసాగర్ రావు (R Vidhyasagar Rao)ను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, తొలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా పనిచేసిన విద్యాసాగర్ రావు వర్థంతి సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు వర్ధంతి (Vidhyasagar Rao Death Anniversary) సందర్భంగా వారికి ఘన నివాళులు (Great Tribute) అర్పించారు.

ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న వివక్షను, జల దోపిడీని ప్రజలకు అర్థమయ్యే భాషలో సులువుగా వివరించిన మేథావి మన విద్యాసాగర్ రావు అని కొనియాడారు. తెలంగాణ జనహృదయాల్లో ఒక జలవిజ్ఞాన నిధిగా, నీళ్ళ సారుగా నిలిచిపోయిన వారు సాగునీటి రంగంలో చేసిన కృషి అనితరసాధ్యమని అన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం వారి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం అని కీర్తించారు.

అంతేగాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, కేసీఆర్ (KCR) ఆహ్వానంతో విద్యాసాగర్ రావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా సేవలందించారని, అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో విలువైన సలహాలు, సూచనలు అందించారని చెప్పారు. ఇక విద్యాసాగర్ రావు మరణం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం, ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా డిండి ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టిందని, విద్యాసాగర్ రావు జన్మస్థలం జాజిరెడ్డిగూడెంలో ఆయన పేరు మీద ఒక సబ్‌మార్కెట్ యార్డును నిర్మించిందని కేటీఆర్ వివరించారు.

Next Story