- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: చెన్నూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. వివేక్ తనయుడిని అడ్డుకున్న BRS శ్రేణులు
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ఉద్రిక్త నెలకొంది. 163వ పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కొడుకు ఏజెంట్ పాస్‌తో

X
దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 163వ పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కొడుకు ఏజెంట్ పాస్‌తో పోలింగ్ బూత్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు వివేక్ తనయుడిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా చెన్నూర్ నుండి కాంగ్రెస్ తరుఫున వివేక్ వెంటకస్వామి, బీఆర్ఎస్ పార్టీ తరుఫున సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బరిలోకి దిగారు.
Next Story






