ఛ‌లో బ‌స్ భ‌వ‌న్ కార్య‌క్ర‌మంలో ఆందోళ‌న‌.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద హై టెన్షన్

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన‌ ఛ‌లో బ‌స్ భ‌వ‌న్ కార్య‌క్ర‌మానికి మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీష్ రావు ఆర్టీసీ బ‌స్సుల్లో చేరుకున్నారు. వారిని పోలీసులు లోప‌లికి అనుమ‌తించగా పార్టీ కార్య‌క‌ర్త‌లను మాత్రం అడ్డుకున్నారు.

ఛ‌లో బ‌స్ భ‌వ‌న్ కార్య‌క్ర‌మంలో ఆందోళ‌న‌.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద హై టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన‌ ఛ‌లో బ‌స్ భ‌వ‌న్ కార్య‌క్ర‌మానికి మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీష్ రావు ఆర్టీసీ బ‌స్సుల్లో చేరుకున్నారు. వారిని పోలీసులు లోప‌లికి అనుమ‌తించగా పార్టీ కార్య‌క‌ర్త‌లను మాత్రం అడ్డుకున్నారు. దీంతో కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగ‌డం వ‌ల్ల ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వ‌ద్ద హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అప్ప‌టికే అక్క‌డ భారీగా పోలీసులు మోహ‌రించ‌గా ఆందోళ‌న‌కారుల‌ను అదుపుచేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్టీసీ చార్జీల పెంపు నేప‌థ్యంలో బీఆర్ఎస్ ఛ‌లో బ‌స్ భ‌వ‌న్ కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. దీంతో ఉద‌యం నుండి ప‌లువురు నేత‌ల‌ను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కేటీఆర్, హ‌రీష్ రావును సైతం హౌస్ అరెస్ట్ చేయ‌గా త‌ర‌వాత బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో హ‌రీష్ రావు, కేటీఆర్ కాసేపు బ‌స్ లోనే ప్ర‌యాణించారు. ప్ర‌యాణికుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.

Next Story