MLC Kavitha: ఇంకా 66 గంటలపాటు దీక్ష చేస్తా.. ఎమ్మెల్సీ కవిత.. ధర్నాచౌక్ వద్ద హై టెన్షన్..

by Ramesh Naini |   (  Updated:2025-08-04 12:48:31  IST  )

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తలపెట్టిన 72 గంటల నిరాహార దీక్షలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

MLC Kavitha: ఇంకా 66 గంటలపాటు దీక్ష చేస్తా.. ఎమ్మెల్సీ కవిత.. ధర్నాచౌక్ వద్ద హై టెన్షన్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) తలపెట్టిన 72 గంటల నిరాహార దీక్షలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం హైదారబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద ఆమె (hunger strike) నిరాహార దీక్ష చేపట్టారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకే దీక్షకు పర్మిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమయం ముగియడంతో దీక్ష స్థలి వద్ద నుంచి (Telangana Jagruthi) జాగృతి నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. ఒకవైపు భారీ వర్షం.. మరోవైపు దీక్ష స్థలం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ధర్నా చౌక్‌లో తెలంగాణ జాగృతి కార్యకర్తలు భయభ్రాంతులకు గురయ్యారు. అరగంటలో ధర్నా చౌక్ ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరించారు. వర్షం తగ్గిన తర్వాత ఎమ్మెల్సీ కవిత దీక్ష స్థలం నుంచి ఆమె నివాసానికి తీసుకువెళ్లే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కవిత మాట్లాడుతూ.. పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు.. శాంతియుతంగా ధర్నా నిర్వహణకు సహకరించాలని పొలీసులకు కవిత రిక్వెస్ట్ చేశారు. ఇంకా 66 గంటలపాటు దీక్ష చేస్తామని కవిత వార్నింగ్ ఇచ్చారు.

ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియదు.. ధైర్యంగా ఉండండి: కేసీఆర్ పిలుపు

Next Story