TG Govt: జూరాల డ్యామ్‌పై హైలెవెల్ రోడ్ బ్రిడ్జ్

by Gantepaka Srikanth |

జూరాలపై హై లెవల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.121.92 కోట్లను కేటాయిస్తూ జీవో జారీ చేసింది.

TG Govt: జూరాల డ్యామ్‌పై హైలెవెల్ రోడ్ బ్రిడ్జ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూరాలపై హై లెవల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.121.92 కోట్లను కేటాయిస్తూ జీవో జారీ చేసింది. జూరాల ప్రాజెక్ట్ డ్యామ్‌కు దిగువన, జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని ధరూర్ మండలం రేవులపల్లి గ్రామానికి, వనపర్తి జిల్లాలోని అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి మధ్య ఈ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్టును నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. అదే సందర్భంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆర్అండ్‌బీ చీఫ్ ఇంజినీర్, స్టేట్ రోడ్స్ హైదరాబాద్‌ అంచనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Next Story