- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం.. హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు హైకోర్టు హెచ్చరిక
హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్(AV Ranganath)ను హైకోర్టు(Telangana High Court) హెచ్చరించింది.

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్(AV Ranganath)ను హైకోర్టు(Telangana High Court) హెచ్చరించింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీ లోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కాగా, హైదరాబాద్‌లోని బతుకమ్మకుంట పరిధిలోని కోర్టు వివాదంలో ఉన్న ప్రైవేటు స్థలంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదన్న హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందున కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు హైకోర్టు రంగనాథ్‌కు నోటీసులు జారీ చేసింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంపై యథాతథస్థితిని కొనసాగించాలని, స్థలాన్ని ఏ విధంగాను మార్పులు చేయరాదంటూ జూన్ 12న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఎ.సుధాకర్‌రెడ్డి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ మరోసారి విచారించిన కోర్టు.. రంగనాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.
ఇదిలా ఉంటే.. గతంలోనూ తమ ఆదేశాలను హైడ్రా పాటించడం లేదని తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తుమ్మిడికుంట పునరుద్ధరణలో విషయంలో అసహనం వ్యక్తం చేసింది. హైడ్రాకు వ్యతిరేకంగా రోజూ 10 పిటిషన్లు వస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. ప్రజలకు మంచి జరిగే పనులు చేయాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించారు.






