- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ అసెంబ్లీ గైర్హజరు పిటిషన్ పై హైకోర్టులో విచారణ
బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీకి గైర్హజవుతున్నారని అసెంబ్లీకి హజరయ్యేలా ఆదేశాలు జారి చేయాలని దాఖలైన పిల్ పై హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీకి గైర్హజవుతున్నారని అసెంబ్లీకి హజరయ్యేలా ఆదేశాలు జారి చేయాలని దాఖలైన పిల్ పై హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది. ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోషియేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరి విజయ్ పాల్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టీస్ సుజయ్ పాల్, జస్టీస్ రేణుక యారా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చెపట్టింది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై , రైతు సమస్యలపై ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది పాడురి శ్రీనివాస రెడ్డి కోర్టుకు వివరించారు. కొన్ని నెలలుగా అసెంబ్లీ సమావేశాల్లో హాజరు కాకుంటే చట్టప్రకారం అనర్హుడిగా ప్రకటించవచ్చని వివరించారు . అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
పిటిషన్ పై జోక్యం చేసుకోవడానికి కోర్టు పరిధి ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిల్ కు విచారణార్హత లేదని అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం కలదని వాదనలు వినిపించడానికి గడువు కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్థించారు. తదుపరి విచారణను ఎఫ్రిల్ 9కి వాయిదా వేసింది. కేసీఆర్ అసెంబ్లీకి హజరయ్యేలా చూడాలని అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ జనరల్ సెక్రటరి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా అడ్వకేట్ నోటిసులు పంపిచారు. అసెంబ్లీకి హజరుకావాలని కేసీఆర్ కు కూడా అడ్వకేట్ నోటిసులు పంపించారు.






