- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైకోర్టులో 2019 గ్రూప్–2 సెలక్షన్ లిస్ట్‌పై మరోసారి విచారణ.. మధ్యంతర ఉత్తర్వులపై కీలక వ్యాఖ్య
2019లో విడుదల చేసిన సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: 2015–16లో నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలలో ఓఎంఆర్ షీట్ల టాంపరింగ్ జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో, 2019లో విడుదల చేసిన సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ, ఇప్పటికే గ్రూప్–2 హోదాలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు అధికారులు నవంబర్ 27న డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.
మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీలులపై డివిజన్ బెంచ్ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. నవంబర్ 24న దాఖలైన మరో అప్పీల్‌తో పాటు ఈ తాజా అప్పీలులను కలిపి విచారణ కొనసాగిస్తామని ధర్మాసనం వెల్లడించింది. సెలక్షన్ లిస్ట్ రద్దు నేపథ్యంలో ఉద్యోగాలు, ప్రమోషన్లు, సేవా నిర్ధారణ వంటి అంశాలపై ప్రభావం ఉండటంతో కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.






