ఐఏఎస్ అరవింద్ కుమార్ పై హై కోర్టు సీరియస్

by Muthe.Rajitha |

ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది.

ఐఏఎస్ అరవింద్ కుమార్ పై హై కోర్టు సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. ఆయన హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ నిర్వాసితుడు తనకు ప్లాట్ మంజూరు చేయక పోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో విచారణ చెపట్టిన హైకోర్టు హెచ్ఎండీఏ కమిషనర్ కు ప్లాట్ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో బాధితుడు విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లాడు.

గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించనందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడు వారాల్లోగా ఆదేశాలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో రెండు వారాల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రస్తుంతం అరవింద్ కుమార్ సెలవు పై విదేశాలలో ఉన్నారు. ప్రభుత్వం ఆయన సెలవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదిన హైదరాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం.

Next Story