- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకోర్టు స్టే.. ఒక్కసారిగా చల్లారిన అభ్యర్థుల ఉత్సాహం
by Prasad Jukanti |
నామినేషన్లకు సిద్ధమైన అభ్యర్థులు హైకోర్టు నిర్ణయంతో షాక్ కు గురయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో (Local Body Elections) హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆశావహులంతా నిరుత్సాహనికి గురయ్యారు. ఇవాళ ఉదయం ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ సైతం విడుదల కావడంతో ఆశావహులంతా నామినేషన్స్ కు అంతా సిద్ధమయ్యారు. పార్టీలు తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగానే నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో కోర్టు స్టే ఇవ్వడం వారందరిని షాక్ కు గురి చేసింది. నోటిఫికేషన్ నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని ఆశావహులు తమ పార్టీ కార్యాలయాల వద్ద క్యూ కట్టారు. ఈ క్రమంలో అక్కడ లీడర్లు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. ఇంతలో హైకోర్టు స్టే విధించడంతో వారంతా ఒక్కసారిగా నిరుత్సాహానికి (Aspirants Disappointment) గురయ్యారు.
కోర్టు నిర్ణయం నేపథ్యంలో ఇవాళ నల్గొండ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్.. హైకోర్టు స్టే దురదృష్టకరం అన్నారు. హైకోర్టు నిర్ణయంతో తమ పార్టీలోని ఆశావహులంతా నిరుత్సహాపడ్డారని చెప్పారు. నామినేషన్లకు అంతా సిద్ధంగా ఉండాలని నిన్న సాయంత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారని చెప్పారు. ఇవాళ ఉదయం నిర్వహించిన జూమ్ కాల్ లో కూడా నామినేషన్స్ విషయంలో పార్టీ పలు సూచనలు చేసిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బీ ఫామ్స్ ఇచ్చేందుకు తాను ప పోటీ చేసేందుకు తమ నాయకులు అంతా సిద్ధంగా ఉన్న సమయంలో కోర్టు స్టే ఇవ్వడం మా అందరిని నిరుత్సాహానికి గురి చేసిందన్నారు. కోర్టు తీర్పు స్టే రావడం బీజేపీ కుట్ర అని శంకర్ నాయక్ ఆరోపించారు. ఎన్నికలు జరగవు అనవసరంగా ఖర్చు చేసుకోవద్దంటూ ఈటల ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. కాంగ్రెస్ బడుగుబలహీన వర్గాల కోసం పాటుపడుతుంటే బీజేపీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
Next Story






