- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు.. భారీగా జరిమానా విధింపు
తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు (High Court) బిగ్ షాకిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు (High Court) బిగ్ షాకిచ్చింది. ఈ మేరకు గత 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ధర్మాసనం సీరియస్ అయింది. ఈ క్రమంలోనే దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 45పై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల విచారణ సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, 2006 నుంచి ఈ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడాన్ని చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ (Aparesh Kumar Singh), జస్టిస్ జీఎం మొహియుద్దీన్ (Mohiuddin) ధర్మాసనం తప్పుబట్టింది. గత అక్టోబర్‌లో ఇచ్చిన లాస్ట్ ఛాన్స్‌ను కూడా సర్కారు వినియోగించుకోకపోవడంతో ప్రతి పిటిషన్‌కు రూ.5 వేల చొప్పున పెనాలిటీ విధించింది. వచ్చిన మొత్తాన్ని రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా అన్ని పిటిషన్లకు కౌంటర్ దాఖలు చేయడానికి జనవరి 9 వరకు తుది గడువును ఇస్తూ చీఫ్ జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేసింది.






