ప్రొ.కోదండరామ్ ప్రమాణ స్వీకారానికి హైకోర్టు షాక్

by Disha Web Desk 13 |
ప్రొ.కోదండరామ్ ప్రమాణ స్వీకారానికి హైకోర్టు షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరామ్, అమీర్ అలీఖాన్ ల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రమాణ స్వీకారం చేయవద్దని మంగళవారం ఆదేశించింది. కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని పేర్కొంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొ. కోదండరామ్, అమీర్ అలీఖాన్ లను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. అయితే ఈ నియామకం పై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకాలను ఆపాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశించింది. అంతకు ముందు ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నిమయించడంతో ప్రమాణ స్వీకారం చేసేందుకు కోడందరామ్, అమీర్ అలీఖాన్ లు సిద్ధం కాగా మండలి చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారంపై హైడ్రామా నడిచింది. ఇంతలో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరో ట్విస్ట్ గా మారింది.


Next Story

Most Viewed