- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court: చిరంజీవి సినిమాకు హైకోర్టు షాక్.. ఆ లెక్కల వివరాలు ఇవ్వాలని ఆదేశం
చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం టిక్కెట్ ధరల పెంపు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఈ11 జనవరి నుంచి 18 జనవరి వరకు పెంచిన ధరల (సింగిల్ స్క్రీన్‌లకు రూ. 50/-, మల్టీప్లెక్స్‌లకు రూ. 100/- జీఎస్టీతో కలిపి) ప్రకారం విక్రయించిన టికెట్ల వాస్తవ గణాంకాలను సమర్పించాలని జీఎస్టీ అధికారులను తెలంగాణకోర్టు ఆదేశించింది. ఈ సినిమాకు టికెట్ ధరలు పెంపు అక్రమం అని అందువల్ల ఈ సినిమా అక్రమ సంపాదించిన రూ.45 కోట్లను రికవరీ చేయాలని డాక్టర్ పాదూరి శ్రీనివాస రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. చట్టవిరుద్ధంగా ఈ సినిమా టికెట్ ధరలు పెంచారని అందువల్ల ఈ సినిమా ఆర్జించిన రూ. 42 కోట్లను ప్రతివాదులు సంయుక్తంగా లేదా వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వ సంచిత నిధికి లేదా హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‍పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. అలాగే దీనిని గతంలో దాఖలైన పుష్ప-2, గేమ్ ఛేంజర్, అఖండ-2, రాజా సాబ్ వంటి సినిమాల టికెట్ ధరల పిటిషన్లతో కలిపి తదుపరి వాయిదా విచారిస్తామని పేర్కోంది.






