High Court : మిమ్మల్ని చూస్తే మాకే భయంగా ఉంది.. సిరిసిల్లా కలెక్టర్‍పై హైకోర్టు సీరియస్

by Prasad Jukanti |

సిరిసిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు సీరియస్ అయింది.

High Court : మిమ్మల్ని చూస్తే మాకే భయంగా ఉంది.. సిరిసిల్లా కలెక్టర్‍పై హైకోర్టు సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై (Sandeep Kumar Jha) తెలంగాణ హైకోర్టు (TG High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్‌కు డ్రెస్సింగ్ సెన్స్ సరిగా లేదని, ఆయనను చూస్తే మాకే భయంగా ఉందని సీరియస్ అయింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి ఆదేశించింది. మిడ్ మానేరు (Mid Maneru) నిర్వాసితురాలు వనబట్ల కవితకు (Vanabatla Kavitha) నష్టపరిహారం ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కానీ ఆమెకు నష్టపరిహారం ఇవ్వకపోగా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఆమెపైనే అక్రమంగా కేసులు పెట్టారు. దీంతో కవిత మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం.. విచారణ కోసం కోర్టుకు హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డ్రెస్సింగ్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదా? కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా? మిమ్మల్ని చూస్తే మాకే భయంగా ఉంది ఇక ప్రజలకు ఎలా సేవ చేస్తారని ప్రశ్నించింది. నిర్వాసితురాలు కవిత విషయంలో గతంలో ఇచ్చిన నష్టపరిహారం తీర్పును యథావిధిగా అమలు చేయాలని ప్రభుత్వానికి, సీఎస్‍కు హైకోర్టు ఆదేశించింది. అలాగే కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీని ఆదేశించింది.

వరుస వివాదాలు:

కాగా వనబట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణకు గతంలో సందీప్ కుమార్ ఝా గైర్హాజరు అవ్వడమే కాకుండా ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడం పట్ల ఆయనపై హైకోర్టు వారెంట్ ఇష్యూ చేసింది. అలాగే సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవ వేడుకల కోసం జిల్లాకు ప్రభుత్వం తరఫున అతిథిగా వచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు జిల్లా కలెక్టర్ హోదాలో సందీప్ కుమార్ ఝా ప్రోటోకాల్ పాటించకపోవడం వివాదాస్పదం అయింది. ఈ అంశంపై ఆది శ్రీనివాస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా కలెక్టర్ కు సీఎస్ నోటీసులు సైతం జారీ చేశారు. వరుసగా కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారుతున్న సందీప్ కుమార్ ఝాపై తాజాగా హైకోర్టు సీరియస్ కావడంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.

Next Story