CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

by Muthe.Rajitha |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌(Quash Petition)పై తెలంగాణ హైకోర్టు(High Court)లో నేడు విచారణ జరిగింది.

CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌(Quash Petition)పై తెలంగాణ హైకోర్టు(High Court)లో నేడు విచారణ జరిగింది. 2016లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి ఈ పిటిషన్‌లో కోరారు. ఈ కేసు గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 127లో భూమి వివాదానికి సంబంధించినది కాగా.. ఎస్సీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ఎన్. పెద్దిరాజు(N Peddiraju) ఫిర్యాదు ఆధారంగా నమోదైంది. రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, ఇతరులు సొసైటీ భూమిని ఆక్రమించి, జేసీబీతో నిర్మాణాలను కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదుదారుడిని కులం పేరుతో దూషించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రేవంత్ రెడ్డి మూడో నిందితుడిగా పేర్కొనబడ్డారు. జస్టిస్ మౌసుమి భట్టాచార్య ఈ కేసును నేడు విచారించారు. వాదనలు ముగిసిన అనంతరం, హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టును ఆశ్రయించి.. ఈ ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని, ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు. విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎనిమిది మంది సాక్షులను విచారించగా.. వారిలో ఎవరూ రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో ఉన్నట్లు నిర్ధారించలేదు.

Next Story