- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీకి హైకోర్టులో రిలీఫ్
మున్సిపల్ శాఖ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల వేళ (Telangana Municipal Elections) తెలంగాణ బీజేపీకి (BJP) హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. దినపత్రికల్లో ఇవాళ, రేపు కూడా ప్రకటనలు ఇచ్చేందుకు అనుమతి లభించింది. ఈ నెల 10,11 తేదీల్లో పేపర్లలో ప్రకటనలకు మున్సిపల్ శాఖ అనుమతి నిరాకరించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల ప్రకారం అనుమతిని రద్దు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపిందంటూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను బీజేపీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం (High Court) మున్సిపల్ శాఖ ఉత్తర్వులను కొట్టివేసింది.
ముందస్తు అనుమతి లేకుండా పత్రికల్లో ప్రకటనలు ఇస్తే చర్యలు:
కాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచార ప్రకటనల విషయంలో తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలు పాటించాలని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ నెల 10, 11 తేదీలలో వార్తాపత్రికలలో ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్‌లు ప్రచురించాలన్నా జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC) నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. అభ్యర్థులు ప్రకటనల కోసం నిర్ణీత ప్రొఫార్మా (Annexure 13-A) లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారం పై పోటీలో ఉన్న అభ్యర్థి సంతకం తప్పనిసరిగా ఉండాలి. పేపర్లో ప్రచురించబోయే ప్రకటన అసలు ప్రతిని దరఖాస్తుతో జతచేయాలి. దీని పై అభ్యర్థి ధ్రువీకరణ ఉండాలి. కలర్ ప్రకటన అయితే కలర్ జిరాక్స్, బ్లాక్ అండ్ వైట్ అయితే దాని జిరాక్స్ కాపీలను రెండు సెట్ల చొప్పున సమర్పించాలి. అభ్యర్థి తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా తగిన ఆధారాన్ని దరఖాస్తుతో పాటు అందజేయాలని ఆంక్షలు పెట్టారు.






