ఓబులాపురం మైనింగ్‌ కేసు విచారణ వాయిదా వేసిన హైకోర్టు

by Naga Rani Yarlagadda |

ఓబులాపురం మైనింగ్ కేసు (Obulapuram mining case)లో హైదరాబాద్ సీబీఐ కోర్టు (Hyderabad CBI Court) ఇటీవలే సంచలన తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.

ఓబులాపురం మైనింగ్‌ కేసు విచారణ వాయిదా వేసిన హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓబులాపురం మైనింగ్ కేసు (Obulapuram mining case)లో హైదరాబాద్ సీబీఐ కోర్టు (Hyderabad CBI Court) ఇటీవలే సంచలన తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, వీడీ రాజగోపాల్, బీవీ శ్రీనివాసరెడ్డి, ఓఎంసీ కంపెనీని దోషులుగా తేల్చిన కోర్టు.. ఏడేళ్లపాటు జైలు శిక్ష విధించింది. సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో తీర్పు వెలువరించింది. కేసు విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందారు. ఏ6 ఐఏఎస్ శ్రీలక్ష్మిని 2022లో కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది కోర్టు. ఏ8 విశ్రాంత ఐఏఎస్‌ కృపానందం, ఏ9 మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్దోషులుగా గుర్తించింది.

తాజాగా ఈ కేసు తీర్పుపై గాలి జనార్దన్ రెడ్డి వేసిన అప్పీల్ పిటిషన్ పై విచారించేందుకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. జనార్దన్ రెడ్డితో పాటు మరో నలుగురి అప్పీల్ పిటిషన్లను కూడా వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. వేసవి సెలువుల తర్వాత రెగ్యులర్ కోర్టులోనే వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో గాలి జనార్దన్ కు ఊహించని షాక్ తగిలినట్లయింది.

Next Story