- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Group-1: గ్రూప్1 తెలుగులో రాసిన వారి వివరాలివ్వండి.. టీజీపీఎస్పీకి హైకోర్టు ఆదేశాలు
గ్రూప్1 పరీక్షల వ్యవహారంపై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం సైతం విచారణ జరిపింది.

దిశ, వెబ్ డెస్క్: గ్రూప్1 పరీక్షల వ్యవహారంపై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం సైతం విచారణ జరిపింది. గ్రూప్1లో వరుస హాల్ టికెట్ల వారికి ఒకే మార్కులు వచ్చాయని, నిర్దేశించిన సమయానికి ప్రొవిజనల్ మార్కుల జాబితా ఇవ్వలేదని పిటిషనర్ల తరుపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. 20 రోజుల తరవాత తుది మార్కుల జాబితా వెల్లడించారని, 20 రోజుల్లో అవకతవకలు జరిగాయనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు. పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం..తెలుగులో పరీక్ష రాసిన అభ్యర్థులకు మార్కులు ఎలా వేశారని ప్రశ్నించింది.
తెలుగులో రాసినవారికి తక్కువ మార్కులు వేశారు అని అభ్యర్థుల్లో ఆందోళన ఉందని, పరీక్షకు సంబంధించి ఏమైనా కీ ఉందా అని ప్రశ్నించింది. ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు మాధ్యమాలకు సంబంధించి కీ లు ఇచ్చారా అని ప్రశ్నించింది. దీంతో కమిషన్ స్పందిస్తూ రాత పరీక్ష కావడంతో మూల్యాంకణంలో ఎలాంటి కీ ఉండదని స్పష్టం చేసింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులే వారి పేపర్లను దిద్దుతారని కోర్టుకు వివరించింది. దీంతో తెలుగులో ఎంత మంది రాశారో, ఎంతమంది ఎంపికయ్యారో వారి వివరాలను ఇవ్వాలని కోర్టు టీజీపీఎస్పీని ఆదేశించింది. అందుకు కమిషన్ బదులిస్తూ తెలుగులో రాసిన వారి వివరాలతో పాటూ, పరీక్షరాసిన అభ్యర్థుల సమాచారం కూడా ఇస్తామని బదులిచ్చింది. తదుపరి విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.






