- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TSPSC పేపర్ లీక్ కేసు.. సిట్‌కు హైకోర్టు కీలక ఆదేశం
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సీబీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సీబీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణను జూన్ 5వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రస్తుత దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో దర్యాప్తు కొంత వరకు సంతృప్తిగా ఉన్నప్పటికి దర్యాప్తు వేగంగా జరగడం లేదని అభిప్రాయపడింది.
దర్యాప్తును వేగవంతం చేయాలని సూచిస్తూ జూన్ 5న దర్యాప్తు పురోగతి నివేదిక ఇవ్వాలని సిట్ కు ఆదేశించింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన ఏజీ.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ జూన్ 5కు వాయిదా వేసింది. అనంతరం పిటిషనర్ బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో మొదటి నుంచి అసలు దోషులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జూన్ 5న జరగబోయే వాదనల్లోనూ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడమో లేక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడమే చేయాలని కోర్టును కోరుతామన్నారు.






