- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు.. సీతక్క వేసిన పిటిషన్ ఇదే!
ములుగు నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని ఎమ్మెల్యే సీతక్క పిటిషన్ వేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ములుగు నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని ఎమ్మెల్యే సీతక్క వేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిధులు మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే సీతక్క పిటిషన్ వేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నందున తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వట్లేదని సీతక్క ఆరోపించారు. సీడీఎఫ్ మంజూరులో జిల్లా మంత్రి ప్రమేయం చట్ట విరుద్ధమని సీతక్క తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జిల్లా మంత్రి ఆమోదంతో నిధులు మంజూరు చేయాలన్న జీవో కొట్టేయాలని పిటిషన్‌లో సీతక్క కోరారు. వెంటనే నిధులు విడుదలకు ఆదేశించాలని న్యాయవాది కృష్ణ కుమార్ గౌడ్ కోరారు. ఎమ్మెల్యే సీతక్క వేసిన పిటిషన్ పై ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను అక్టోబర్ 9కి హైకోర్టు వాయిదా వేసింది.
Next Story






