- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : తెలంగాణ సర్కారుకు హైకోర్ట్ నోటీసులు
తెలంగాణ ప్రభుత్వానికి(Telangana Govt) హైకోర్ట్(HighCourt) షాక్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వానికి(Telangana Govt) హైకోర్ట్(HighCourt) షాక్ ఇచ్చింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్(Hyderabad) నగరంలో కమ్యూనిటీ భవనాలకు(Community Buildings) భూకేటాయింపులు జరపడంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టకూడదని ప్రభుత్వానికి నోటీసులు(Notices to Govt) జారీ చేసింది. నగరంలో బలిజ, కాపు, వెలమ, కమ్మ సంఘాలకు భూ కేటాయింపులు జరపడం పట్ల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కుల సంఘాలకు కట్టబెట్టడం కరెక్ట్ కాదని, వెంటనే ఆ జీవో కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన కోర్ట్.. ఆయా భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ న్యాయవాది కొంత సమయం కోరగా.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్ట్.






