- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోహింగ్యా వలసదారుల స్థితిపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీ రోహింగ్యా వలస దారుల అంశంపై మూడు వారాల లోపు సమగ్ర స్థితి నివేదికను దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీ రోహింగ్యా వలస దారుల అంశంపై మూడు వారాల లోపు సమగ్ర స్థితి నివేదికను దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వలసదారుల అక్రమ నివాసంపై హైకోర్టు దాఖలైన పిటిషన్ పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. అక్రమ వలసలపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్లు విఫలమయ్యారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అధికారులు పూర్తిగా విఫలం..
పిటిషన్‌లో అక్రమంగా రాష్ట్రంలో నివసిస్తున్న బంగ్లాదేశీ, రోహింగ్యా వలసదారులను గుర్తించడం, ధృవీకరించడం లేదా అదుపులోకి తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కోన్నారు. అక్రమాదారుల ఉనికి జాతీయ భద్రత, ప్రజా శాంతి, జనాభా సమతుల్యతకు తీవ్రమైన ముప్పుగా మారిందని పిటిషనర్ అడ్వకేట్ కరుణ సాగర్ కోర్టులో వాదించారు. అక్రమ వలసదారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ జనవరి 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతినిధానం సమర్పించినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అందువల్లే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై మూడు వారాల లోపు నివేదికను దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.






