- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రూప్-1 పై హైకోర్టు సంచలన తీర్పు
గ్రూప్-1 ర్యాంకింగ్స్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: గ్రూప్ - 1 పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన తీర్పు ఇచ్చింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ ను రద్దు (rankings list Cancel) చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాతే తిరిగి మెయిన్స్ పలితాలను విడుదల చేయాలంది. అలాగే రీవాల్యుయేషన్‌కు 8 నెలల్లో సమయం ఇచ్చింది. ఒక వేళ మూల్యాంకనం సాధ్యం కాకపోతే తిరిగి పరిక్షలు నిర్వహించాలని ధర్మాసనం టీజీపీఎస్సీకి ఆదేశించింది. జస్టీస్ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం సుదీర్ఘ విచారణ అనంతరం జూలై 7న తుది విచారణ జరిపి తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఏప్రిల్ నెలలో టీజీపీఎస్సీ గ్రూప్-1 (TGPSC Group-1) మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు (Valuation irregularities) జరిగాయని కొంత మంది అభ్యర్థులు ఆరోపిస్తూ.. మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా విచారణ అనంతరం జనరల్ ర్యాంకింగ్స్ లిస్టును రద్దు చేయాలని కోర్టు తీర్పును ఇచ్చింది.
Read More: హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: హరీష్ రావు






