- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ లెజిస్లేచర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా తులసి రాజ్ నియామకం
హైకోర్టు న్యాయవాది తులసి రాజ్ గోకుల్ తెలంగాణ లేజిస్లేచర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైకోర్టు న్యాయవాది తులసి రాజ్ గోకుల్ (Tulsi Raj Gokul) తెలంగాణ లేజిస్లేచర్ స్టాండింగ్ కౌన్సిల్(Legislature Standing Council)గా నియమితులయ్యారు. శనివారం లెజిస్లేచర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా బాధ్యతలు స్వీకరించిన తులసి రాజ్ గోకుల్, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar), చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులు తులసి రాజ్ గోకుల్‌కు అభినందనలు తెలియజేశారు. ఆయన అనుభవం, న్యాయపరమైన సలహాలు లెజిస్లేటివ్ పాలనా వ్యవహారాలకు మేలు చేస్తాయని వారు అభిప్రాయపడ్డారు.
కాగా, వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తులసి రాజ్ గోకుల్ నిజాం కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, పడాల రామిరెడ్డి లా కాలేజీలో లా కోర్సు పూర్తి చేశారు. గత 30 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా ఆయన సేవలందిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన, శాసన సంబంధిత వ్యవహారాలలో నిష్ణాతుడిగా పేరుపొందిన ఆయన న్యాయరంగంలో విశేష అనుభవం కలిగివున్నారు.






