- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhatti Vikramarka : భట్టికి హైకమాండ్ నుంచి పిలుపు
తెలంగాణ(Telangana)లో కొత్త మంత్రులకు(New Ministers) శాఖల కేటాయింపు అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో కొత్త మంత్రులకు(New Ministers) శాఖల కేటాయింపు అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ విషయంలో హైకమాండ్(AICC) తో చర్చలు జరిపేందుకు రెండు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ (Uttam Kumar Reddy) రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. అయితే మరో సీనియర్ నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramrka)కు కూడా అధిష్టానం నుంచి పిలుపు అందింది. భట్టి మంత్రుల సమావేశంలో ఉండగా ఫోన్ రాగా.. శాఖల మార్పుపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. వెంటనే ఢిల్లీ రమ్మని కబురు అందడంతో కాసేపట్లో బయల్దేరి వెళ్లనున్నారు.
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, టీపీసీసీ కార్యవర్గ కూర్పు, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాల నేపథ్యంలో ఉత్తమ్, భట్టీలకు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు రావడం రాష్ట్ర కాంగ్రెస్ లో ఆసక్తిని రేపుతోంది. సీఎం ఢిల్లీలో ఉండగానే పీసీసీ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. ఇపుడు ఉన్నపలంగా వీరిద్దరికీ పిలుపు రావడం వెనుక కొత్త మంత్రులకు శాఖలను కేటాయింపు అంశంపైనే చర్చిస్తారా లేక ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులపై చర్చించేందుకు పిలిచారా అనేది తెలియాల్సి ఉంది. ఇవేవి కాకుండా పార్టీ పరంగా ఎదైనా కీలక మార్పు ఉండబోతున్నదా అనేది సస్పెన్స్ గా మారింది. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ లో తాజా పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.






