- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హన్మకొండ జిల్లా వేలేరులో హిడ్మా ఫ్లెక్సీల కలకలం!
హన్మకొండ జిల్లా వేలేరులో ఇటీవల మరణించిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత హిడ్మా ఫ్లెక్సీల కలకలం రేగింది. సురేష్, బచ్చయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఫ్లెక్సీలో ఓ వీరుడా నువ్వు కన్న కళ దోపిడి లేని స్వేచ్ఛ దేశం. నీ సింధూరం పీడిత జనానికి కొత్త పొద్దు.

దిశ, వెబ్ డెస్క్: హన్మకొండ జిల్లా వేలేరులో ఇటీవల మరణించిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత హిడ్మా ఫ్లెక్సీల కలకలం రేగింది. సురేష్, బచ్చయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఫ్లెక్సీలో ఓ వీరుడా నువ్వు కన్న కల దోపిడీ లేని స్వేచ్ఛ దేశం. నీ సింధూరం పీడిత జనానికి కొత్త పొద్దు. ప్రజల గుండెల్లో నీ చరిత్ర సజీవం. పీడిత జనాల స్వేఛ్చా పోరాటానికి నీవు నిత్యం రణభేరి నినాదం. జనతన సర్కార్ ఆశయం చిరస్థాయి వీరుడా హిడ్మా.. నీ పోరాటం అమరం.. అంటూ ఫ్లెక్సీలో రాసి ఉంది.
దీంతో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మావోయిస్టులపై సానుభూతి వ్యక్తం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఏపీలోని మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మద్వి హిడ్మా అతని భార్య రాజే మరణించారు. హిడ్మా లొంగిపోదామని సిద్ధమైనప్పటికీ ఆయన్ను బూటకపు ఎన్కౌంటర్ చేశారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో హిడ్మా ఓ జర్నలిస్టుకు రాసిన లేఖ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. video






