హై కోర్టులో హీరో విజయ్ దేవర కొండ పిటిషన్ విచారణ

by Ajay Maddhiboyina |

తన నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు కొట్టివేయాలని హీరో విజయ్ దేవర కొండ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హై కోర్టు విచారణ జరిపింది.

Vijay Devarakonda
X

దిశ, తెలంగాణ బ్యూరో: తన నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు కొట్టివేయాలని హీరో విజయ్ దేవర కొండ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హై కోర్టు విచారణ జరిపింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ పై తీర్పు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేసిన రెండు నెలలు తరువాత గిరిజన నాయకులు ఫిర్యాదు చేశారని, ఇందులో దురుద్దేశం ఉందని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ విషయమై విజయ్ దేవరకొండ సామాజిక మాధ్యమాల్లో క్షమాపణ కూడా చెప్పారని హైకోర్టుకు వివరించారు. ఓ మూవీ ఈవెంట్‌‌లో విజయ దేవర కొండ చేసిన వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా, వారి ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ గిరిజన సంఘాల నాయకులు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయంలో విజయ్ దేవరకొండ పై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వ్యాఖ్యలపై జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యడు హుస్సేన్ నాయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story