- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాంపల్లి కోర్టుకు హీరో నాగార్జున, నాగచైతన్య
సినీ హీరో నాగర్జున బుధవారం నాంపల్లి కోర్టుకు వచ్చారు

దిశ, తెలంగాణ బ్యూరో : సినీ హీరో నాగర్జున బుధవారం నాంపల్లి కోర్టుకు వచ్చారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా ఉన్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యాలపై పిటిషన్ లో స్టేట్మెంట్ ఇచ్చేందుకు నాగర్జున, నాగ చైతన్య నాంపల్లి కోర్టులో హజరయ్యారు. ఆయన వేసిన పరువు నష్టం దావా కోర్టు విచారణలో ఉందని కోర్టు నోటిసుల మేరకు హజరై స్టేట్మెంట్ ఇచ్చినట్లు విచారణ అనంతరం నాగర్జున మీడియాకు తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యాల పై తమ కుటుంబం ను మానసిక క్షోభకు గురించేసిందని నాగర్జున మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు చెపట్టాలని పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ ను స్వీకరించిన నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారి చేసింది. ఈ కేసులో కొండా సురేఖ కూడా పలుమార్లు నాంపల్లి కోర్టులో విచారణకు హజరయ్యారు. కేసు విచారణ కొనసాగుతుంది.






