డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన హీరో మంచు విష్ణు

by Disha Web Desk 2 |
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన హీరో మంచు విష్ణు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రముఖ సినీ నటుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కలిశారు. ఆదివారం హైదరాబాద్‌లోని భట్టి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలు సమస్యలపై ఇరువురు చర్చించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టిని సన్మానించారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ పెద్దలతో టాలీవుడ్ ప్రముఖులు వరుసగా భేటీలు అవుతున్నారు. ఎవరికి వారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, సంబంధిత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలుస్తూ విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed