తెలంగాణలో ఏఎస్ఐ మంజూరు చేసిన వారసత్వ పరిరక్షణ ప్రాజెక్టులేవి లేవు

by Prasad Jukanti |

తెలంగాణలోని వారసత్వ కట్టడాలు మంచి పరిరక్షణలో ఉన్నాయిని కేంద్రం తెలిపింది.

తెలంగాణలో ఏఎస్ఐ మంజూరు చేసిన వారసత్వ పరిరక్షణ ప్రాజెక్టులేవి లేవు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆమోదించిన ఏ ఒక్క వారసత్వ పరిరక్షణ ప్రాజెక్టూ లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్ సభకు వెల్లడించింది. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ వింటర్ సెషన్ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కందూరు రఘువీర్ రెడ్డి తెలంగాణలో మంజూరు చేయబడిన వారసత్వ పరిరక్షణ ప్రాజెక్టుల సంఖ్యపై అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర మంత్రి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ లోక్ సభలో వెల్లడించారు.ఈ సందర్భంగా షేకావత్ మాట్లాడుతూ.. తెలంగాణలో భారత పురావస్తు సర్వే మంజూరు చేసిన వారసత్వ పరిరక్షణ ప్రాజెక్టులు ఏవీ లేనప్పటికీ ASI అధికార పరిధిలో ఎనిమిది కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు, ప్రదేశాల పరిరక్షణ, సంరక్షణ, నిర్వహణ నిరంతర ప్రక్రియ అని వనరుల అవసరం, లభ్యత ప్రకారం ఇవి కొనసాగుతాయన్నారు. ప్రస్తుతం అన్ని స్మారక చిహ్నాలు మంచి సంరక్షణ స్థితిలో ఉన్నాయని తెలిపారు. మరోవైపు సంబంధిత మంత్రిత్వ శాఖ 2022-23 సంవత్సరానికి రూ.15.50 కోట్లు, 2023-24కి రూ.14.38 కోట్లు, 2024-25కి రూ.6.80 కోట్లు, 2025-26కి రూ.9 కోట్లు 2025 నవంబర్ 25 వరకు కేటాయించించినట్లు పేర్కొంది.

Next Story