- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మానాన్నలను కోల్పోయిన పిల్లలకు అండగా హెల్పింగ్ హాండ్స్
అమ్మా నాన్నలను కోల్పోయిన పిల్లలకు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అండగా నిలిచింది. ఇటీవల ఆత్మకూర్ మండల పరిధిలోని గట్టికల్ గ్రామం లో మోరపాక లక్ష్మి అనే మహిళ మృతి చెందగా తరవాత ఆమె భర్త మోరపాక రాములు

దిశ, వెబ్ డెస్క్: అమ్మా నాన్నలను కోల్పోయిన పిల్లలకు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అండగా నిలిచింది. ఇటీవల ఆత్మకూర్ మండల పరిధిలోని గట్టికల్ గ్రామం లో మోరపాక లక్ష్మి అనే మహిళ మృతి చెందగా తరవాత ఆమె భర్త మోరపాక రాములు సైతం రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమారులు మొరపాక శివ 9ఏళ్లు, మొరపాక సాయి 4ఏళ్లు ఉన్నారు. తల్లి దండ్రులను ఇద్దరినీ కోల్పోయి చిన్నారులు అనాథలు కాగా ఆ కొద్దిరోజులకే తాత బిక్షంను సైతం కోల్పోయారు. దీంతో పిల్లలను అదే గ్రామానికి చెందిన రాచకొండ రమేష్ హేమలత దంపతులు చేరదీశారు. వారి ఆలనాపాలనా చూసుకుంటున్నారు. అయితే పిల్లల పరిస్థితి హైదరాబాద్‌కు చెందిన హెల్పింగ్ హాండ్స్ సంస్థకు తెలియడంతో వారు స్పందించి దాతల ద్వారా ఆర్థికసాయం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న GM & అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ.. పోలీస్ డిపార్టుమెంటులో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ లు చెరుకు నాగరాజు, లింగయ్య, రాజు, మహారాజ్ తమ హెల్పింగ్ హాండ్స్ సంస్థ ద్వారా ఎన్నో సహాయ సహకారాలు అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ పిల్లల బాగోగులకోసం తర్వాత కాలంలో కూడా అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు. చిన్న బాబు సాయి చదువులకు అయ్యే ఖర్చు 1 నుంచి 10వ తరగతి వరకు అయ్యే పూర్తి ఖర్చు ఒకటే సారి స్కూల్ లో కట్టేస్తామని హామీ ఇచ్చారు. అనాథ పిల్లలకు ఆసరా నిలిచి అందరించే సహాయ సహకారాలు అందజేసెలా చేయూత నిస్తూ వారి బాగోగులు చూస్తున్న రాచకొండ రమేష్, హేమలత దంపతులకు, అనాథ పిల్లలకు సహకారం అందిస్తున్న దాతలకు మరియు గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. అక్కడికి వచ్చిన గ్రామస్తులు హెల్పింగ్ హ్యాండ్ సభ్యులకు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.






