- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ వ్యాప్తంగా దంచికొట్టిన వర్షం.. ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం(Heavy Rain) దంచికొట్టింది. గురువారం మధ్యాహ్నం రెండు గంటల వరకు నార్మల్‌గానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. అకాల వర్షం పడింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం(Heavy Rain) దంచికొట్టింది. గురువారం మధ్యాహ్నం రెండు గంటల వరకు నార్మల్‌గానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. అకాల వర్షం పడింది. దీంతో చాలాచోట్ల రోడ్లపైకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో ఎక్కడివాహనాలు అక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్(Hyderabad Traffic) అయింది. హైదరాబాద్‌లోని సోమాజీగూడలో రోడ్డుమీద చెట్టుకూలి పడింది. అదే సమయంలో ఓ కారు రాగా, ఆ చెట్టు కారుపై పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అమ్మాయిలు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.
మరోవైపు.. ఈ వర్షం కారణంగా పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం కోడోని పల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. సుంకరి సైదమ్మ (40), గాజుల వీరమ్మ (55) గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో వేరుశనగ కాయలు తెంచేందుకు వెళ్లారు. మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలోనే ఆ మహిళలపై పిడుగుపడి సైదమ్మ, వీరమ్మ అక్కడికక్కడే మరణించారు.






