- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో మూడు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కుమరం భీం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గాలివేగం గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో కురిసే అవకాశం ఉంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పే అవకాశాలు ఉండడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 13నుంచి 16 వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమరంభీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నల్గొండ, నారాయణ పేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ లో 9 సెం.మీ, నారాయణ్ పేట్ జిల్లా కోస్గిలో 8 సెం.మీ, వికారాబాద్ జిల్లా బొమ్రాస్ పేట్ లో 8 సెం.మీ, రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ లో 7 సెం.మీ, సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో 6 సెం.మీ, నిర్మల్ జిల్లా సారంగపూర్ లో 6 సెం.మీ, ఖమ్మం జిల్లా బోనకల్ లో 6 సెం.మీ, మంచిర్యాల జిల్లా భీమిని లో 6 సెం.మీ, కుమరం భీం అసిఫాబాద్ లో 5 సెం.మీ, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 5 సెం.మీ, కుమరం భీం జిల్లా అసిఫాబాద్ లో 5 సెం.మీ, వనపర్తి జల్లా ఖిలా ఘన్ పూర్ లో 5 సెం.మీ, ఖమ్మం జిల్లా చింతకం లో 5 సెం.మీ, వికారాబాద్ జిల్లా తాండూరులో 5 సెం.మీ, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 5 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.






