ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకూ.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-18 13:35:01  IST  )

తెలంగాణలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ (Telangana Weather) వెల్లడించారు.

ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకూ.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ (Telangana Weather) వెల్లడించారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ తెలంగాణ సెంట్రల్, ఈస్ట్ జిల్లాలకు భారీ వర్షసూచన చేశారు. భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy to Very Heavy Rains) కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జనగామ, వికారాబాద్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకూ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయని తెలిపారు. నగరం 24 గంటల్లో 30 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు.

Next Story