- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్పోరేషన్ , మున్సిపల ఎన్నికలకు భారీ భద్రత
రాష్ట్రంలో మున్సిపల్ , కార్పోరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని డీజీపీ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై డీజీపీ బుధవారం సమీక్ష నిర్వహించారు.

దిశ తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మున్సిపల్ , కార్పోరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని డీజీపీ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై డీజీపీ బుధవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, ఉచితాల పంపిణీని అడ్డుకోవడానికి తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించుతామన్నారు. 50 వేల రూపాయల కన్నా ఎక్కువ నగదును తీసుకు వెళుతున్నట్లయితే తగిన ఆధారాలు చూపించాలని, లైసెన్స్ కలిగిన ఆయుధాలను వెంటనే డిపాజిట్ చేయాలని, అక్రమ ఆయుధాల ఏరివేతకు ప్రత్యేక సోదాలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
పాత నేరస్తులు, రౌడీషీటర్లు, గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించి ఆర్థిక పూచీకత్తుతో బైండోవర్ చేస్తున్నామని వివరించారు. వేయ్యికి పైగా ఉన్న అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజల్లో భరోసా కల్పించేందుకు సాయుధ బలగాలతో 'ఫ్లాగ్ మార్చ్' నిర్వహిస్తామని డీజీపీ తెలిపారు. ఎక్సయిజ్ , ఫారెస్ట్ శాఖలకు సంబంధించిన రెండు వేల మంది బందోబస్తు కోసం అందుబాటులో ఉంటారన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సహకారంతో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల నుంచి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలు కౌంటింగ్ హాల్స్ వరకు ప్రోటోకాల్ ప్రకారం అంచెలంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.






