TGICCC: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద భారీ భద్రత.. ఎందుకంటే?

by Ramesh Naini |

హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (Police Command Control Center) వద్ద భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

TGICCC: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద భారీ భద్రత.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (Police Command Control Center) వద్ద భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రానున్నారు. (Formula E-car race case) ఫార్ములా ఈ- కార్ రేసు కేసు వ్యవహారంలో ఇవాళ (సోమవారం) బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను విచారిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ఆఫీస్, ఐసీసీసీ, ఏసీబీ ఆఫీస్ ఒకే దగ్గర ఉండడంతో హడావుడి వాతావరణం ఏర్పడింది. ఈ మేరకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, 12 పొడవునా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేటీఆర్‌‌ను అరెస్ట్ చేస్తారని టాక్ రావడంతో ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. ముందస్తు చర్యలుగా తెలంగాణ భవన్, ఏసీబీ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి పోలీసులు తాళం సైతం వేశారు.

కాగా, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. రైతు భరోసా అమలు, పెండింగ్ చెల్లింపులపై మంత్రులతో రివ్యూ చేయనున్నట్లు సమాచారం. వారం రోజుల్లో రైతులకు నగదు పంపిణీ చేయాలన్న టార్గెట్‌పై నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్ యువ వికాసం పురోగతిపై కూడా సీఎం సమీక్షించనున్న ట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు, కాళేశ్వరం కమిషన్ నివేదిక చర్చ పలు అంశాలపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది.

Next Story