కొట్టుకుపోయిన ట్రాక్.. 12 రైళ్ల రాకపోకలకు అంతరాయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-27 09:07:02  IST  )

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ...

కొట్టుకుపోయిన ట్రాక్.. 12 రైళ్ల రాకపోకలకు అంతరాయం
X

దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డి జిల్లా(Kamarddy District)లో భారీ వర్షం(Rain) బీభత్సం సృష్టించింది. ఎడతెరిపిలేకుండా ఉదయం నుంచి కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కామారెడ్డి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద భారీ ఎత్తున వరద నీరు ప్రవహించింది. దీంతో కార్లు నీటిలో మునిగిపోయాయి. పలుచోట్ల కాలనీలు నీటిమునిగిపోయాయి. ఇళ్లల్లోకి మోకాల్లోతు నీళ్లు చేరాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లలోకి సైతం వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు కామారెడ్డి-నిజామాబాద్(Nizamabad) వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. తలమట్ల వద్ద వాగుపొంగడంతో రైలు పట్టాలపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో 12 రైళ్లకు రాకపోకలకు అంతరాయం కలిగాయి. 4 రైళ్లను దారి మళ్లించారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులను కొనసాగిస్తున్నారు.

Next Story